Search
Close this search box.
Search
Close this search box.

కాపుల అభివృద్ధి సంక్షేమంపై దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి

శ్వేతపత్రం

      విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo 23 వ రోజు కార్యక్రమం 45వ డివిజన్ అధ్యక్షులు బొమ్ము గోవింద లక్ష్మి ,రాంబాబు గారి ఆధ్వర్యంలో మిల్క్ ప్రాజెక్ట్ వద్ద గల సత్తెమ్మ గుడి వద్దనుండి ప్రారంభించి 45డివిజన్ లోని కొండ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. పోతిన మహేష్ గారు మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 45 డివిజన్ లోని మిల్క్ ప్రాజెక్టు వద్ద గల సత్తెమ్మ గుడి వద్ద నుండి ప్రారంభించి కొండ ప్రాంతంలోని పరిసర ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటే ప్రజలందరూ కూడా వైసిపి ప్రభుత్వాన్ని తీసేస్తాం జనసేన పార్టీని గెలిపిస్తాం తద్వారా మా సమస్యలను పరిష్కారం అవుతాయని ప్రజలందరూ కూడా సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు అని రాబోయే జనసేన ప్రభుత్వం అంటే జనసేన పార్టీ అధికారంలోకి వస్తదని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనే సంపూర్ణ విశ్వాసంతోనే మేము ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందని ఎక్కడికి వెళ్లినా సరే ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఈ రాష్ట్రా సమస్యల మీద పోరాటం చేస్తున్నారని మార్పు అవసరమని ఆ మార్పు పవన్ కళ్యాణ్ గారి ద్వారానే సాధ్యమని వారి ద్వారానే ఈ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన వస్తదని అర్హులైన వారందరి కూడా పథకాలు అందుతాయని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తదని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని ప్రజలందరూ కూడా సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గం లో పనికిమాలిన ఎమ్మెల్యేకి పనికిమాలిన పార్టీకి ఎందుకు ఓటు వేసామా అని ప్రజలందరూ కూడా బాధపడుతున్నారని డివిజన్లోని కొండ ప్రాంతంలో ప్రజలు నడవడానికి సరైన మార్గం లేక తీవ్ర ఇబ్బందులుకు గురవుతున్నారని ఆ ప్రాంతంలో శాశ్వత రహదారి నిర్మించకుండా ఒక చిన్న ఐరన్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారని దాని ద్వారా ప్రజలు నడవలేక తీవ్ర ఇబ్బందులుకు గురవుతున్నారని ఈ 45 డివిజన్లోని సత్తెమ్మ గుడి వద్ద గల కొండ ప్రాంతం దగ్గరికి స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఏమి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని మీకు సవాలు విసురుతున్నానని మీరు అక్కడ పది రోజుల్లో గా రిటైనింగ్ వాలు కట్టించిన అక్కడ బ్రిడ్జి తీసి రోడ్డు నిర్మిస్తావా అని నీకు సవాలు విసురుతున్నానని డివిజన్లో కొండ ప్రాంతంలో రోడ్లు సరిగా లేవని త్రాగునీరు సరిగా రావడం లేదని దోమల బెడద విపరీతంగా ఉందని డ్రైనేజీ పూడికలు సరిగా తీయడం లేదని ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని మాకు ఎటువంటి పెన్షన్లు వద్దని కనీసం నడవడానికి దారి అయినా ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో ఎంత అడ్డడుగున ఉందో ప్రజలందరూ కూడా గమనించాలని, స్థానిక కార్పొరేటర్ ఎన్నికల సమయంలో కనిపించడమే తప్ప తర్వాత కనిపించనేలేదని ఆఫీసుకు వెళ్లి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటే మేము ఏమి చేయలేము అని సమాధానం వారి దగ్గర నుంచి వస్తుందని, ప్రజల సమస్యలు పరిష్కరించ లేనప్పుడు మీరు కార్పొరేటర్ గా వుండి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని మీరు ఆ పదవులకు రాజీనామా చేసేయాలని ప్రజల సమస్యల మీద రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున మేము బలంగా పోరాడుతామని ప్రజలకు అండగా నిలబడతామని, తుని ఘటనలో కేసు కొట్టేసారని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారని కానీ వారు కాపు సామాజిక వర్గానికి ఈబిసి రిజర్వేషన్ ఎందుకు అమలు చేయడం లేదని ఎవరైనా అడిగారా అని, కాపు కార్పొరేషన్ సంబంధించిన నిధులు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి ఇంతవరకు వినియోగించారా లేక దారి మళ్లించారా అని ఎవరైనా మాట్లాడారా అదేవిధంగా కాపుల విదేశీ విద్య పథకం అటకెక్కితే ఎవరైనా మాట్లాడారా ఈ అంశాల మీద బలంగా పోరాటం చేయాలని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నామని కాపు కార్పొరేషన్ కి సంబంధించిన నిధులు మీరు కేటాయించిన నిధులు ఎన్ని అని, కాపుల సంక్షేమానికి మీరు కేటాయించిన నిధులు ఎన్నో శ్వేత పత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని కాపులను ఎంతసేపు ఓటు బ్యాంకు కోసమే ఉపయోగించుకుంటూ వారు అధికారంలోకి రావడానికి మాత్రమే కాపులను ఉపయోగించుకునే వైసిపి ప్రభుత్వంను నమ్మొద్దు అని పశ్చిమ నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే కాపుల్ని ఎంత దారుణంగా మోసం చేశాడో ప్రజలందరూ కూడా గమనించాలని సీనియర్ నాయకులు సామినేని ఉదయభాను గారిని, ఆకుల శ్రీనివాసరావు గారిని అవమానించిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు కాదా అని కేబుల్ మాఫియాకు వత్తాసు పలికి కార్పొరేటర్ భర్త అయినటువంటి అత్తులూరి పెదబాబు నేను ఆత్మహత్య చేసుకుంటా అనే స్థాయికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గపు వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు అని దీనికి ఆయన సమాధానం చెప్పాలని అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం కాపుల అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది అని కాపుల ఈబిసీ రిజర్వేషన్ కావాలనే ఇప్పటివరకు అమలు చేయడం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి కాపుల ద్రోహి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాని మాట్లాడటం జరిగింది.
              బొమ్ము రాంబాబు మాట్లాడుతూ ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో 45వ డివిజన్లో కొండ ప్రాంతంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈరోజు సత్తెమ్మ తల్లి గుడి దగ్గర నుండి కొండ ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగిందని మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే మేము అనుకున్న దాని కంటే అనేక సమస్యలు ప్రజలు మాకు పెద్ద ఎత్తున తెలియజేస్తున్నారని కొంతమంది ఆరోగ్య సమస్యతో హార్ట్ సర్జరీ చేసినటువంటి వారు మరియు వికలాంగులు మాకు అర్హత ఉన్నా కూడా పెన్షన్లు తీసేసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా ఎప్పుడు జనసేన ప్రభుత్వాన్ని మేము గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా తెలుపుతున్నారని మా నాయకులు పోతే మహేష్ గారి ఈ డివిజన్లో అనేక సమస్యల మీద పోరాటం చేశారని ముఖ్యంగా రోడ్లు గురించి గానీ,కబేళా దగ్గర కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మేము జనవాణిలో పెట్టిన తర్వాతే నిర్మించారని అంటే జనసేన ప్రభుత్వం ఈ ఈ నియోజకవర్గంలోని సమస్యల మీద పోరాటం చేస్తేనే తప్ప పనులు చేయడం లేదని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈసారి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని మరియు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని ముఖ్యంగా అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో మా నాయకులు పోతిన వెంకట మహేష్ గారికి అఖండ విజయం అందించాలని ఈ సందర్భంగా ప్రజలును కోరుతున్నానని మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రెడ్డి మోహన్, క్రిష్, మామిడి చిన్న, శ్రీను, డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్, ఆకుల రవిశంకర్, కొరగంజి వెంకటరమణ, శిగినం శెట్టి రాము గుప్త, ఏలూరి సాయి శరత్, నల్లబిల్లి కనకారావు, పొట్నురి శ్రీనివాసరావు, వెన్న శివశంకర్ , స్టాలిన్ శంకర్, బోట్టా సాయి,గన్ను శంకర్, రజిని,పుల్ల రావు, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way