Logo
Date of Publish : 31 March 2026, 1:12 am
Editor : Sake Naresh

హరిహర మహాక్షేత్రంలో భక్తి వెల్లువ… వైభవంగా శ్రీవారి ఏకాదశ కళ్యాణ మహోత్సవం

హరిహర మహాక్షేత్రంలో భక్తి వెల్లువ… కన్నుల పండుగలా శ్రీవారి ఏకాదశ కళ్యాణ మహోత్సవం

కడియం, మార్చి 30 (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని హరిహర మహాక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారి ఏకాదశ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులతో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణతో గ్రామ వీధులు మార్మోగాయి.. సాయంత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తర సహస్రనామార్చనతో పాటు కర్పూర జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలు భక్తి పరవశాన్ని కలిగించాయి. అనంతరం సాయంత్రం 7.30 గంటలకు విష్వక్సేన ఆరాధనతో ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ వేద పండితులు కాండ్రకోట పద్మనాభాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు అలగిరి భాస్కరాచార్యులు నేతృత్వంలో వేద పండితులు మంత్రోచ్ఛారణలతో నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవం భక్తులకు కన్నుల పండుగగా నిలిచింది. ఈ కళ్యాణ మహోత్సవంలో పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దివ్య కళ్యాణాన్ని దర్శించి పుణ్యఫలాలను పొందారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com