విజయనగరం ( జనస్వరం ) : జనసేనపార్టీ గజపతినగరం, బొండపల్లి గ్రామం ఎస్సీ కాలనీ ప్రజలు వాటర్ ట్యాంక్ సమస్యను నియోజకవర్గ సమన్వయకర్త మర్రాపు సురేష్ దృష్టికి తీసుకుని వచ్చారు. స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకులు వాటర్ ట్యాంక్ నిర్మాణం కొరకు గృహ సముదాయం ఉన్నచోట నిర్మించడానికి స్థానిక అధికార పార్టీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వేరే ప్రాంతంలో నిర్మించాలని దీనిపై జనసేన పార్టీ సమన్వయకర్త సురేష్ గారికి ఎస్సీ కాలనీ ప్రజలు వాటర్ ట్యాంక్ సమస్య తెలియజేశారు. ఈరోజు ప్రాంతాన్ని సందర్శించి, నేరుగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలుకి అనుకూలంగా అనువైన ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మించాలని, స్థానిక అధికార పార్టీ నాయకులకు, బొండపల్లి ఎమ్మార్వో కి, గ్రామ సెక్రెటరీకి, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొండుపల్లి టిడిపి మండల అధ్యక్షులు బండారు బాలాజీ, జనసేన నాయకులు ఆధాడ మోహన్ రావు, బొండపల్లి జనసేన నాయకులు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com