– పెన్షన్ డబ్బులలో 50 వేలను దొంగలించిన వాలంటర్
పెడ్డకడబురు, జనస్వరం న్యూస్ (అక్టోబర్03): మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలోని సచివాలయం1 లో గాంధీ జయంతి రోజున గ్రామ వాలంటర్ తమ చేతివాటంను చూపించాడు. పింఛన్ పంపిణీ కొరకు, వాలంటీర్లకు ఇవ్వడం కోసం వెల్ఫేర్ అసిస్టెంట్ తెచ్చిన డబ్బులలో 50వేలను కాజేసి ఏమి ఎరగనట్టు ఉన్నాడు. వాలంటీర్లకు పంచడంలో తేడా రావడంతో వెల్ఫేర్ అసిస్టెంట్ ఆరా తీసిన ఏమి ఎరుగనట్టుగా వ్యవహరించాడు. తీరా సమస్యను పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా, సమస్య విషమించడంతో వాలెంటర్ ఒప్పుకొని డబ్బులను తిరిగి ఇచ్చాడు. గ్రామంలోని నాయకులు సమస్యలో చొరవ తీసుకొని స్టేషన్ బయటి రాజీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై మా ప్రతినిధి ఎస్ఐ మహేష్ కుమార్ ను వివరణ కొరగా మా దృష్టికి ఏ సమస్య రాలేదని, ఏ సమస్యపై వచ్చిన సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేసుకుంటామని తెలిపారు. అలాగే దీనిపై మా ప్రతినిధి, ఎంపీడీవో ప్రభాకర్ ను వివరణ కోరగా సమస్య ఇంతవరకు నా దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేపట్టి, వాస్తవం అయితే వాలంటరీ పై చర్యలు తీసుకుంటామని అన్నారు.