విజయవాడ ( జనస్వరం ) : విజయవాడ, (జనస్వరం) : 46వ డివిజన్ అధ్యక్షులు షేక్ షర్మిల అమీర్ భాషల ఆధ్వర్యంలో మిల్క్ పాల ఫ్యాక్టరీ వద్ద స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. పింగళి వెంకయ్య 60వ వర్ధంతి కార్యక్రమంలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొని పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ భారత జాతీయ పతాకమైన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన చారిత్రాత్మక సృష్టికర్తగానే కాకుండా తన జీవితంలో ఉపాధ్యాయుడిగా, రచయితగా, వ్యవసాయవేత్తగా, భాషావేత్తగా పనిచేశారని, ఎప్పుడూ సులభమైన జీవితాన్ని గడపలేదని, భారతదేశం ఐకానిక్ జాతీయ జెండా రూపకర్త అయినప్పటికీ, వెంకయ్య తన ప్రతిష్టను ఎప్పుడూ క్యాష్ చేసుకోలేదని కష్టతరమైన జీవితాన్ని గడిపారని, ఇప్పటి నాయకులు ఆయన ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గోపిశెట్టి వెంకన్న , బేవర లోకేష్, బుద్దన ప్రసాద్, వడ్డాది రాజేష్, మరుపిల్ల రాజు ఎస్ డి కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.