తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : ఆరుగొలను గ్రామంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్ మరియు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుంచి చిక్కల వెంకన్న కుటుంబ సభ్యులు మరియు వారి సన్నిహితులు 50 మందికి పైగా శ్రీనివాస్ మరియు వారి తనయులు రాజేష్ చేతుల మీదుగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరి ఇరువురు ప్రతి గుమ్మం వద్దకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసే దుర్మార్గపు పరిపాలన గురించి వివరిస్తూ వచ్చే ఎన్నికలలో జనసేన ప్రభుత్వాన్ని ఎన్నుకొని పవన్ కళ్యాణ్ నీ సీఎం చేయాలని కరపత్రాలు పంచుతూ ప్రజలను కోరారు. అనంతరం అడపా ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఆరుగొలను గ్రామంలో జనసేనకు అండగా ఉండి వచ్చే ఎన్నికల్లో బొలిశెట్టి శ్రీనివాస్ ని ఎన్నుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కొట్టు సత్యనారాయణకి ప్రజలు ఏమైపోయినా చీమకుట్టి నట్టు ఉండదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు పట్టని వైసీపీ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న కొట్టు సత్యనారాయణ వైఖరికి నిరసనగా బొలిశెట్టి శ్రీనివాస్ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం జనసేన పల్లేపోరు అని అన్నారు.
అనంతరం బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నవరత్నాల పేరుతో ప్రజలను తుంగలోకి ముంచారని గొంతు విప్పి ప్రశ్నించే వారందరి మీద తప్పుడు కేసులు బనాయించి వారి ఇంటి సభ్యులపై ఒత్తిడి చేసి రాజకీయాలకు దూరంగా ఉండేలా చేస్తున్నారని ప్రస్తుత కలుషిత రాజకీయాలను కడిగిపారేసేందుకు పవన్ కల్యాణ్ నీ సీఎం చేసే విధంగా జనసేన పార్టీ అరుగొలను గ్రామంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రతీచోట అంకిత భావం ఉన్న కార్యకర్తలు జనసేనకు ఉన్నారన్నారు. అరుగొలను గ్రామంలో అక్రమ గ్రావెల్ మైనింగ్ వల్ల ఆరుగొలను గ్రామ ప్రజలు ఇళ్ళ ముందు నుంచి లారీలు వెళ్లడం వల్ల రోడ్లు నాశనం అయిపోగా వాటి ద్వారా వచ్చే దుమ్ము వల్ల ప్రజలు ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయనీ స్థానిక మినిస్టర్ సహచరుల తో కోట్లలో రూపాయలు దందా వసూలు చేసి వారితో అక్రమ మైనింగ్ చేస్తురనీ ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల గ్రామ ప్రజలకు గాని గవర్నమెంట్ కానీ ఒక రూపాయి ఆదాయం లేదనీ అన్నారు. గ్రామ ప్రజలు ఈ దుమ్ము వల్ల అనారోగ్యం పాలై హాస్పిటల్లో లక్షలలో కచ్చు పెట్టిన ఆరోగ్యం బాగుపడదనీ, గ్రామ పంచాయతీలో ఉన్న 14వ 15వ ఆర్థిక సంఘం నిధులు గవర్నమెంట్ లాగేసుకోవడం వల్ల గ్రామాల్లో ఉన్న రోడ్లు గాని డ్రైనేజీలు గాని అన్ని కూడా అధ్వానంగా ఉన్నాయనీ అన్నారు. గ్రామపంచాయతీలో 1వ వార్డు 6వ వార్డు 11వ వార్డులో రోడ్ల వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బంది పడుతున్నారనీ అలాగే దళితవాడలో ఎస్సీ ఏరియాలో డ్రైనేజీ వ్యవస్థకి ఔట్లెట్ లేక రోడ్డు మీదే నీళ్లు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారనీ అన్నారు. హై స్కూల్ కి వెళ్లే పిల్లలకు సరైన రోడ్డు సౌకర్యం లేక స్కూల్ కి వెళ్లే విద్యార్థిని విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారనీ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ మూడురోజుల పల్లేపోరును అడుగడుగున ఇంత ఘనవిజయం చేసిన ఆరగొలను ప్రజలకు గ్రామ జనసేన నాయకులకు జనసైనికులకు వీర మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, ఆరుగొలను గ్రామ అధ్యక్షులు అడపా వీరన్న, గ్రామ సర్పంచ్ పీతల బుచ్చిబాబు, రూరల్ మండలం ఉపాధ్యక్షులు రత్తయ్య మండల కమిటీ సభ్యులు, చిక్కాల రామానాయుడు, చిక్కాల వెంకన్న ముసలి నాని, మాన్యం వెంకటరత్నం, పురేటి శ్రీరామ్, గోపిరెడ్డి రాంబాబు, గోపిరెడ్డి రాము, భయ్యా ధనరాజు, కట్టా సోమరాజు, వీరమల్లు నాగరాజు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.