Logo
Date of Publish : 29 March 2024, 10:38 am
Editor : Sake Naresh

ఆలోచింపజేస్తున్న జనగళం పాట

          న్యూస్ ( జనస్వరం ) : నిరంతరం యాక్టివ్ గా ఉండే " టీం రాజకీయం " నుండి జనగళం సాంగ్ ను 28 వ తేదీన రాత్రి 9 గంటలకు జనసేన పార్టీ ఆఫీసియల్ అకౌంట్ ద్వారా లాంచ్ చేశారు. ఈ సాంగ్ ను  దుర్గా కోమలి, ఏ.ఆర్. గోవింద్, సత్య సాయి రచించారు. కళ్యాణ్ వసంత్ సంగీతాన్ని కూర్చి పాటను చాలా అద్భుతంగా పాడారు. ఎడిటింగ్ ను శ్రీనివాస్ గుజ్జె చేశారు. ఈ సాంగ్ ను కిరణ్ కుమార్ దేవరాజ, శివ సాగర్ వళ్ళూరి, టీం రాజకీయం ఆధ్వర్యంలో సమర్పణ చేశారు. టీం సభ్యులు మాట్లాడుతూ జనసేన పార్టీ జెండాలో ఉన్న 6 కోణాలు, పార్టీ 7 సిద్దాంతాలను కలగలిపి అర్థం పరమార్థం ఉండేలా రాశామని చెప్పుకొచ్చారు. ఈ సాంగ్ కోసం దాదాపుగా 60 రోజులు కష్టపడ్డామని, రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో స్పందన చూశాక ఆ కష్టాన్ని మర్చిపోయామని తెలియజేశారు. జనసేన పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్న సందర్భంలో మా సాంగ్ రిలీజ్ అవ్వడం ఆనందంగా ఉందన్నారు. పిఠాపురంలో జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయ భేరి సందర్బంగా శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో టీం రాజకీయంఆధ్వర్యంలో ఆయన పేరు మీద అర్చన, నిత్యన్నదానం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ కోసం మా టీం తరుపున ఎన్నికలలో శాయశక్తుల్లా కృషి చేస్తామని అన్నారు. సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా జనగళం పాట మారుమ్రోగుతోంది. “జాతి మెచ్చిన భారతం జనసేన!” “మాకు నీ పై నమ్మకం చెరిగేనా”, జనసేన జనగళం.. గాజు గ్లాసు జాతర! అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు జనసైనికులు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com