నెల్లూరు ( జనస్వరం ) : SR పురం మండల కేంద్రంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఇంచార్జి యుగంధర్ పొన్న మాట్లాడుతూ ఆడబిడ్డ నడిరోడ్డుపై అర్దరాత్రి కూడా స్వేచ్ఛగా తిరగాలి అని ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగలు చేసి మనకి స్వేచ్ఛ స్వాంతత్ర్యాన్ని ఇచ్చారు. మరి ఆ స్వాతంత్ర దినోత్సవం రోజునే గుంటూరులో రమ్య అనే ఆడబిడ్డపై ఒక ఆగంతకుడు అతి దారుణంగా దాడి చేసి హతమార్చటం అతి బాధాకరం. ఆ యువతి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున మా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తరుచూ విద్యార్థినిలు, యువతులపైన దాడులు హత్యలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఇలాంటి ఘటనలకు పాలుపడుతున్న వారిని కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని ఆయన తెలిపారు. దిశ చట్టం, దిశ ఆప్ అని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వలేకపోతున్నారని, ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇచ్చి, అమలులేని దిశ చట్టాల గురించి చెప్పి ఇన్ని రోజుల్లో శిక్ష పడుతుందని చెప్పి కుటుంబాలను మోసం చేసి, ఈ ప్రభుత్వం చేతులు దులుకుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు న్యాయం జరిగేది ఒక్క జనసేన పార్టీ వలనే అని, రమ్య హత్య కేసులో అరెస్ట్ చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, మరొక్క మారు రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చేయాలన్న కూడా భయపడే విధంగా ఆ నిందితుడిని శిక్షించాలని జనసేన పార్టీ తరుపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సమన్వయ కర్త రాఘవ, మండల ఉపాధ్యక్షులు శీనయ్య, చార్లెస్, నాయకులు విజయ్, శివ ఉన్నారు.