రాజంపేట, ఏప్రిల్ 07 (జనస్వరం) : ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణం తోట కన్వెన్షన్ సెంటర్ లో రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు ఆద్వర్యంలో వేలాదిమంది జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు కార్యకర్తలలతో జరిగిన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేటను అన్ని విధాలా మోసం చేసి, అభివృద్ధిని అడ్డుకున్న వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని రాజంపేట నియోజకవర్గ జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన సుగవాసి బాలసుబ్రమణ్యంకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో జనసేన కార్యకర్తలకు, జనసైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి అండదండలుగా ఉంటానని ఏ కష్టం వచ్చినా ఆ కష్టంలో తన భాగమై ఉంటానని ఈ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోయినప్పటికీ అధిష్టానం నిర్ణయం మేరకు కూటమి అభ్యర్థిని మనమందరం రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి గెలిపించాల్సిన బాధ్యత ఉందని కార్యకర్తలకు తెలిపారు. అధిష్టానం నుండి కూడా మనకు భవిష్యత్తులో సముచిత స్థానం లభిస్తుందని, ఎవ్వరూ బాధపడవద్దని ఆయన భరోసానిచ్చారు. మనందరి లక్ష్యం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్న సైకో, నియంత పాలన పోయి ప్రజాపాలన వచ్చేందుకు మనందరం కృషి చేయాలన్నారు. అలాగే కూటమి అభ్యర్థి అయిన సుగవాసి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ రాజంపేటను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన సభాముఖంగా హామీ ఇచ్చారు. రాజంపేటనుండి వెళ్లిపోయిన జిల్లా కేంద్రం, మెడికల్ కాలేజ్ తో పాటు అన్నిరంగాలలో రాజంపేటను అభివృద్ధికి కూడా కృషి చేస్తానన్నారు. అధికార పార్టీ నాయకుల తప్పిదంతో తెగిపోయిన అన్నమయ్య డ్యాం ను పునరుద్ధరించి రైతాంగాన్ని ఆదుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు. శ్రీనివాసరాజు లాంటి చదువుకున్న మంచి మనసున్న వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే వారి సహకారానికి ఇది నిదర్శనమని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనసేన కార్యకర్తలందరికీ భరోసాగా ఉంటానన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com