పాయకరావుపేట ( జనస్వరం ) : రాబోయే ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తులలో భాగముగా పాయకరావుపేట సీటు వంగలపూడి అనితకు కేటాయిస్తే సపోర్ట్ చేసేది లేదని జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి స్పష్టం చేశారు. పాయకరావుపేట మండలం, నామవరం గ్రామం గెడ్డం బుజ్జి గారి తోటలో జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై గెడ్డం బుజ్జి మాట్లాడుతూ 2014 ఎన్నికలలో టిడిపి బిజెపి జనసేన పార్టీ పొత్తులలో భాగముగా పాయకరావుపేట టిక్కెట్ వంగలపూడి అనిత కేటాయిస్తే కష్టపడి గెలిపించామని, నెలరోజులు గడవకుండానే నాపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేసిందని, నా ఆస్తులు పై సిట్ వేసిందని అలాంటి వారికి మేము ఎలాగూ సపోర్ట్ చేస్తామని ప్రశ్నించారు. అలాంటివారిని అవసరమైతే ఓడిస్తాం కానీ గెలిపించే ప్రసక్తే లేదని పునరుద్గాటించారు. జనసేనకు కేటాయిస్తే కష్టపడి గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారాహియాత్ర అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మూగి శ్రీనివాస్,గడసాల అప్పారావు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే జన సైనికులు గుండెల్లో ఉన్న ప్రేమ రోడ్డు పైకి తీసుకురావాలని ఓట్లు పడేలా జన సైనికులు కష్టపడి పనిచేయాలని సూచించారు మనందరం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివధత్, గెడ్డం కన్నబాబు, పెద్దాడ రమణ, గెడ్డం చైతన్య, నార్పరెడ్డి పద్మ, జనసేన సర్పంచ్ పులగపూరి అప్పల నరస, పల్లి దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com