కళ్యాణదుర్గం, (జనస్వరం) : జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య జనసేన పార్టీ పనితీరును పరిశీలన కోసం అబ్జర్వేషన్ చేయడానికి కళ్యాణదుర్గం నియోజకవర్గంకు విచ్చేసిన సందర్భంగా జనసేన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య మాట్లాడుతూ అందరూ జనసేన పార్టీ కోసం ఐక్యమత్యంతో పనిచేయాలని, టిడిపి వారిని సమన్వయం పరచుకుని ముందుకెళ్లాలని, పొత్తులో భాగంగా జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థిని అందరూ కష్టపడి కచ్చితంగా గెలిపించుకోవాలని సూచించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేన నేతలు, వీరమహిళలు, నాయకులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, జనసైనికులు యొక్క పనితీరు చాలా బాగుంది అని ప్రశంసించారు. ఈ సమావేశంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ గారు, జిల్లా కార్యదర్శులు లక్ష్మీనరసయ్య, పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, కళ్యాణదుర్గం నాయకులు అనిల్ పాల్యం, రాజు పాల్గొన్నారు. తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ఇంచార్జ్ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్యని ఘనంగా సన్మానించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com