Logo
Date of Publish : 18 October 2022, 4:18 pm
Editor : Sake Naresh

రాజంపేట పట్టణంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

           రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్యజిల్లా, రాజంపేట పట్టణంలో కాపు సంక్షేమ యువసేన, మహిళాసేన, సభ్యులు ఆత్మీయ సమావేశం జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అందులో భాగంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ మాధ్యమాల్లో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో ప్రతిఒక్కరు కాస్త సమయం వెచ్చించి క్షేత్ర స్థాయిలో ప్రత్యేకంగా దృష్టి సారించి సామాజిక మార్పు అభ్యున్నతి కోసం బలోపేతం దిశగా అందరినీ సోదరా, సోదరీ భావంతో కలుపుకుని ముందుకు వెళ్ళాలని కోరారు. అలానే జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వనికి మద్దతుగా ఆయన ఆశయ భావాలకు అనుగుణంగా తమ ప్రాంతాల్లో అందరూ కలిసి చైతన్యం నింపాలని కోరారు. ఇతరులతో నిరంతర ప్రక్రియగా మమేకం అవుతూ అందరి మద్దతు కూడగట్టుకొని రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాజ్యాధికారం సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, నరసింహ, రామ శ్రీనివాస్, రెడ్డిరాణి, సుభాషిణి, నియోజకవర్గ అధ్యక్షులు గోపాల్, రాజేష్, చిరంజీవి యువత అధ్యక్షులు నాగార్జున, యువతి, యువకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com