పెందుర్తి ( జనస్వరం ) : జనసేన అధ్వర్యంలో ఆదివారం ఎస్.కోట అర్.కే.కళ్యాణమండపం లో ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సమావేశము నుద్దేశించి ఎస్.కోట నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టి డి పి, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేయడములో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారని వారి కృషిని అభినందించారు. ఎస్.కోట నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో జనసేన పార్లమెంట్ అభ్యర్థికి గాజు గ్లాసుకి 16680 ఓట్లు పడ్డాయని ఇది విజయనగరము జిల్లాలో అన్ని నియోజకవర్గాల జనసెన ఓట్లకన్న ఎక్కువ బలమున్న నియోజకవర్గంగా నిరుపితo అయిందన్నరు. ప్రస్తుతం జనసేన బలం 35000 వేలుకు పెరిగిందన్నారు. కావున ఎస్.కోట నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ జనసేనకు కేటాయినచ్చలని మాపార్టీ అధిష్టానాన్ని కోరుతున్నమన్నారు. కూటమిలో ఏ పార్టీకి టికెట్ కేటాయించిన కూటమి అభ్యర్ధి గెలుపు కోసం జనసయినికులందరము సమిష్టిగా కష్టపడి పనిచేస్తామని తిర్మానించుకున్నమన్నరు. ఈ కార్యక్రమంలో 5 మండలాల జనసెన నాయకులు కొత్యడ రామకోటి, సుంకర అప్పారావు, గొరపల్లి రవికుమార్ జామీ వర్మ రాజు రమెళ్ల శివాజీ అలమండ రాంబాబు, జొన్నపల్లి సత్తిబాబు డేగల ఈశ్వరరావు తది తరులు పాల్గొని ప్రసంగించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com