దెందులూరు, మార్చి31 (జనస్వరం) : దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలంలో పసుపులేటి భార్గవ్ ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన, టిడిపి, బిజెపి పార్టీల దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, ఏలూరు జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతు జగన్ రెడ్డి వల్ల మోసపోయిన రాష్ట్ర ప్రజలకు జగన్ రెడ్డి అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను అర్ధమయ్యేలా వివరించాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే, వ్యాపారస్థుల వ్యాపారాలు బాగుండాలంటే, వ్యవసాయదారుల వ్యవసాయం బాగుండాలంటే ఖచ్చితంగా NDA కూటమి అధికారంలోకి రావాల్సిందే అని అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ని, ఎంపీ కూటమి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఉందని మంచి రోజులు రావాలంటే రాష్ట్రానికి నరేంద్ర మోదీ సహకారం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుల నాయకత్వం అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు,వీర మహిళలు, తెలుగు మహిళలు, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com