Search
Close this search box.
Search
Close this search box.

వేమూరు నియోజకవర్గంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

వేమూరు

        వేమూరు ( జనస్వరం ) : వేమూరు నియోజకవర్గంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లను అభినందించి,  సత్కరించారు. వారిని శాలువాతో సన్మానం చేసి అమ్మవారి షీల్డు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి సోమరౌతు ఆనురాధ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు.  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way