Logo
Date of Publish : 31 July 2023, 12:52 pm
Editor : Sake Naresh

సర్వేపల్లిలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

   సర్వేపల్లి ( జనస్వరం ) : వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో ఉన్న షాదీ మందిర్ నందు సోమవారం నెల్లూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ గారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ గారు సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న జన సైనికులకు, జనసేన నాయకులకి లీగల్ సెల్ మీద అవగాహన కల్పించారు. కొన్ని సూచనలను సలహాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అధికార పార్టీ నాయకుల బెదిరింపులు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, గ్రామాల్లో ఉన్న సమస్యలు కావచ్చు, చట్టపరమైన న్యాయబద్ధమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ జనసేన సైనికులలో ఒక కొత్త నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చే విధంగా కార్యచరణ, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి. అధికార పార్టీ నాయకుల ఎత్తుగడ్డలకి ఏవిధంగా దీటుగా ఎదుర్కోవాలన్న అంశాలపై అవగాహన కల్పించారు. జన సైనికులకు, జనసేన పార్టీ నాయకులకు మద్దతుగా లీగల సెల్ ఉంటుందని, జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనీ, ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, రహీం, ఖాజా, శ్రీహరీ, అక్బర్, అశోక్, సంజు రాకేష్, వంశీ, సాయి, జాన్, కార్తీక్, శ్రీను ,కిరణ్, దినేష్, చందు, రియాజ్, గోవర్ధన్, హరి, కళ్యాణ్, పవన్, ప్రసాద్, అశోక్, మదన్, గురవయ్య, సురేష్, హరీష్, పండు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com