పాడేరు ( జనస్వరం ) : పాడేరు జనసేనపార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్ష సమావేశంలో జనసేనపార్టీ జిల్లా కమిటీ నాయకులు, మండల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రామస్థాయి సమావేశాల నిర్వహణ పై చర్చించారు. ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్య జనసైనికులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. జనసేనపార్టీ గిరిజన ప్రజల విశ్వాసం చూరగొంటుందని నియోజకవర్గంలో నమోదైన యువ ఓటర్లు గెలుపు ఓటములను తీవ్ర ప్రభావం చూపనున్నారని యువ ఓటర్ల మద్దతు ఉన్న ఏకైక పార్టీ జనసేనపార్టీ మాత్రమేనని అన్నారు.