పాడేరు ( జనస్వరం ) : జీకే వీధి మండలంలో డా. వంపూరు గంగులయ్య గారు ఆదేశాల మేరకు జెర్రెల కొత్తూరు గ్రామంలో జన సైనికుల సమావేశం అవటం జరిగింది. ఈ కార్యక్రమంలో జీకే వీధి మండల అధ్యక్షులు కొయ్యం బాలరాజు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక గ్రామ సమస్యలను మనమంతా కలిసికట్టుగా మన జీకే వీధి పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామం యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని వాటి యొక్క గ్రామ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే మన జనసేన పార్టీ గెలిపించుకునే బాధ్యత మనలో ఉందని అన్నారు. ప్రతి గ్రామ ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి మనమంతా ఏకమై జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించాలని మన పాడేరు నియోజకవర్గంలో డా. వంపూరు గంగులయ్య గారిని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిపించుకోవాలి అని జన సైనికులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొత్తురు విష్ణుమూర్తి, ముర్ల సంతోష్, అరడ కోటేశ్వరరావు, వనపల ఈశ్వర్, పాంగి నూకరాజు, పూజారి అనిల్ కుమార్, కవడం బంగారాజు, జీకే వీధి మండలం యూత్ అధ్యక్షులు కొయ్యం సిద్దు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com