Logo
Date of Publish : 19 September 2023, 10:28 pm
Editor : Sake Naresh

జి.మాడుగులలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

         అరకు ( జనస్వరం ) : పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జి.మాడుగుల మండల జనసేనపార్టీ నాయకుల మండల సమావేశం మండలస్థాయి నాయకులతో సమావేశమైనారు. లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ మండల నాయకులందరు కలిసి ఏకాభిప్రాయం తో ముందడుగు వేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుల్లో భాగంగా కలిసి ఎన్నికలకు సిద్ధమవుతున్నామని అన్నారు. అందుకు మనమంతా కలిసికట్టుగా సమిష్టి నిర్ణయంతో క్షేత్రస్థాయి ప్రజా బాట పట్టాల్సిన అవసరముందని అన్నారు. అలాగే జనసేనాని నిర్ణయం మనందరికీ శిరోధార్యంగా భావించి మిత్రపక్షాలతో కలిసి ఒక రాక్షస పాలనపై యుద్దానికి సిద్దమవుతున్నమని అన్నారు. కచ్చితంగా పాడేరు నియోజకవర్గంలో జనసేనపార్టీ జెండా ఎగరెలా మన శక్తివంచన లేకుండా కృషి చేద్దామని అన్నారు. ఇవాళ గిరిజన గ్రామాల్లో ఏ పార్టీకి లేని ఆదరణ కేవలం జనసేనపార్టీ కి మాత్రమే లభిస్తుందనే విషయం మరిచిపోవద్దని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, లక్ష్యాలుకి గిరిజన యువత బ్రహ్మరథం పడుతున్నామాట మనమంతా చూస్తూనే ఉన్నామన్నారు. మండల స్థాయి నాయకులు తమ తమ బాధ్యతలను నిర్వర్తించి ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. జి.మాడుగుల మండల అధ్యక్షులు మాట్లాడుతూ కచ్చితంగా అధినేత పవన్ కళ్యాణ్ గారిని సీఎం చెయ్యడానికి మనమంతా బలంగా పని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు మసాడి భీమన్న, కిల్లో రాజన్ లీగల్ అడ్వైజర్,  తెరవాడ వెంకటరమణ, తల్లే త్రిమూర్తి, మసాడి సింహాచలం, బూత్ కన్వీనర్ భాను ప్రసాద్ కొర్ర, నాగేశ్వరరావు, సోమన్న, భీమన్న, తల్లే కృష్ణ తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com