సర్వేపల్లి ( జనస్వరం ) : బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మొదటి విడత సర్వేపల్లి నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్నటువంటి తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీ నందు సమీక్ష సమావేశాన్ని తోటపల్లి గూడూరు మండల అధ్యక్షుడు అంకెం సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు గుడి హరిరెడ్డి రావడం జరిగింది. అందులో భాగంగా నూతన కార్యచరణ మరియు కొంతమంది ముఖ్యమైన నేతలని పార్టీలోకి ఆహ్వానించడం 2024 లో ప్రజా ప్రభుత్వ స్థాపనకు గ్రామస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అడుగులు ముందుకు వేసే విధంగా సమావేశం ప్రారంభించడం జరిగింది. ఇదేవిధంగా మిగిలిన 4 మండలాల్లో కూడా ఇదే కార్యచరణతో జనసేన పార్టీ బలంగా ముందుకు వెళుతుందని అన్నారు. ఈ అవినీతి అరాచకపు ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజా ప్రభుత్వాన్ని గదే ఎక్కించడం జనసేన పార్టీ లక్ష్యం ఆ లక్ష్యం వైపు అడుగులు ముందుకు వేస్తూ అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రవికుమార్, శరత్, RMP .విజయ్ ,ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, చిరంజీవ అధ్యక్షుడు ఖాజా, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు అశోక్, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి, వంశి, తదితరులు పాల్గొన్నారు.