
కళ్యాణదుర్గం, (జనస్వరం) : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం తూముకుంట గ్రామంలో జనసేనపార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కుందుర్పి మండల కమిటీ ఆధ్వర్యంలో తూముకుంట గ్రామంలో దాదాపు 40 క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకున్న క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ పాలసీ వల్ల ప్రమాద బీమా హాస్పిటల్ ఖర్చులకు 50 వేలు వరకు మరణించిన ఎడల 5 లక్షలు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అని తెలియజేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ చేసిన రైతుల ఆత్మహత్య కుటుంబాలకు లక్ష చొప్పున మొత్తం 30 కోట్లు రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగిందని తెలియజేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి 10 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని జన సైనికులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కుందూర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు చలపాడి రమేష్, సెట్టూరు మండల కన్వీనర్ కాంత రాజ్, తూముకుంట గంగాధర్, హనుమంత రాయుడు, మల్లికార్జున, ధనంజయ, వీర మహిళ, షేక్ తార, మమత, కళ్యాణదుర్గం జనసేన నాయకులు వంశీ, జాకీర్, ప్రసన్న, మంజునాథ్, ప్రకాష్, పవన్, మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.