పార్వతీపురం ( జనస్వరం ) : కృష్ణపల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయుకులు గుంట్రెడ్డి గౌరీశంకర్ మరియు కృష్ణపల్లి జనసేన టీమ్ ఆధ్వర్యంలో పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగురుమణి అధ్యక్షతన ముఖ్య అతిధులుగా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, సాలూరు సమన్వయకర్త గేదెల రిషి వర్ధన్, పార్వతీపురం ఐటీ కోర్డినేటర్ పైల సత్యనారాయణ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ నాయుకులు మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వం జనసేన - టిడిపి కూటమి ప్రభుతమే అని అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే స్థానచలనం చేస్తుంది కానీ జరగాల్సినది సీఎం స్థానచలనం అని, ఎలక్షన్స్ సమయంలో అవ్వ, అమ్మ, అక్క అంటూ నుదుట నిమురుతూ ప్రభుత్వంలోకి వచ్చారు. సంపూర్ణ మధ్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి, అమాంతంగా మద్యం ధరలు పెంచి నాసిరకమైన బ్రాండ్లు తీసుకోచ్చి జనాల సొమ్ము కాజేస్తున్నాడు అంటూ వాపోయారు. జనసేన-తెలుగు దేశం పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని, ఈసారి ఫ్యాన్ స్విచ్చాఫ్ అవ్వడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, సాలూరు బొనేలా గోవిందమ్మ, జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శులు చిట్లు గణేష్, అల్లు రమేష్, గంటేడ స్వామినాయుడు, పార్వతీపురం నాయుకులు చందక అనిల్, ఖాతా విస్వేశ్వరావు, కాళీ, నరేష్, దుర్గ ప్రసాద్, మణి, జనార్దన్, భాస్కర్,రాజు శరత్ సీతానగరం నాయుకులు జై శంకర్ శివశంకర్, సాయికిరణ్, సత్యనారాయణ బలిజిపేట నాయుకులు అప్పలనాయుడు, శివ, టిడిపి నాయుకులు, కృష్ణపల్లి జనసైనికులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com