పాడేరు ( జనస్వరం ) : నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు అధ్యక్షులుగా ఎన్నికైన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ప్రమాణస్వీకారం చేయించారు. పాడేరు జనసేనపార్టీ ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పాడేరు పురవీధుల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ జనసైనికులతో పాడేరు వీధుల్లో జనసేన నినాదం మారు మ్రోగిందని అన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ కచ్చితంగా అల్లూరీ జిల్లా నుంచి జనసేనపార్టీ పోటీలో ఉంటుందని మీరంతా కష్టపడి పనిచేసి మీ ఆలోచన విధానాన్ని గిరిజన ప్రజలకు తెలియజేస్తూనే వారికి వాస్తవ రాజకీయాలపై పవన్ కళ్యాన్ ఆలోచన అవసరాన్ని తెలియజేయాలన్నారు. బాధ్యతలు త్రికరణశుద్దిగా మోస్తూనే పనిచేయాలని ఇన్చార్జ్ గారి అడుగుజాడల్లో నడవాలని క్రమశిక్షణ ఉల్లంఘించారాదని అన్నారు. పాడేరు ఇన్చార్జ్ డా..గంగులయ్య మాట్లాడుతూ జనసేనపార్టీ మార్పు కోసం ఎగిసిన జ్వాల వంటిదని ఎందరో చదువుకున్న యువరక్తంతో నిండిపోయిందని జనసేనపార్టీ గ్రౌండ్ లెవెల్ స్థాయిని తక్కువ అంచనా వేసే ప్రత్యర్థులకు కచ్చితంగా వచ్చే ఎన్నికలు ఒక గుణపాఠం కానుందని జనసేనపార్టీ పాడేరు నియోజకవర్గం కైవసం చేసుకుంటుందన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వివిధ మండల అధ్యక్షులకు అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ నాయకులు ఉపధ్యక్షురాలు కిట్లంగి పద్మ, కార్యదర్శి ఉల్లి సీతారామ్, సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్,వీర మహిళలు దివ్యలత, దుర్గాలత, పార్వతి, మండల అధ్యక్షులు మాసాడి భీమన్న, సీసాలి భూపాల్, టీవీ. రమణ, తల్లే త్రిమూర్తులు, వంతల బుజ్జిబాబు, కొయ్యం బాలరాజు, సుర్ల సుమన్, గూడెపు లక్ష్మణ్ రావు, పెద్దఎత్తుననియోజకవర్గ జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com