తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి జనసేన ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన బీసీ ఆత్మీయ సమ్మేళనం ప్రారంభించారు. ఈ కార్యక్రమoలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో ఉన్న వివిధ బీసీ సంఘాల నాయకులు భారీగా పాల్గోన్నారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం జరిగిందని పేర్కోన్నారు. బీసీలను ఆదుకునే దిశగా మీతో ప్రయాణం చేస్తానని పేర్కొన్నారు. బీసీలు కాపులు వేరు కాదని బీసీ లో నేను కూడా ఒకడి గా చేరి బీసీలకు ఒక భవనానికి కావలసిన స్థలాన్ని ఇచ్చి భవనాన్ని నిర్మిస్తానని బొలిశెట్టి శ్రీనివాస్ బిసి లకు హామీ ఇచ్చారు. బీసీ లందరూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనకు తోడ్పాటు ఇవ్వాలని కులమతాలకు అతీతంగా జనసేన మీతో ప్రయాణం చేస్తుందని బయట వారు కాపు అనే ముద్రను వేసి వేరు చేస్తున్నారని ఆయన పేర్కోన్నారు. వచ్చే ఎలక్షన్లలో కలిసికట్టుగా బీసీలకు సముచిత స్థానాన్ని ఏర్పాటు చేస్తానని బీసీ లను ఎప్పుడు అన్నదమ్ముల్లాగానే చూశానని పేర్కోన్నారు. నేను కూడా బీసీల భవనానికి ఒక బీసీగా నిలబడి మా నాన్నగారి పేరు మీద భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కొంతమంది జనసేన వస్తే రౌడీయిజాన్ని పోషిస్తారని నాయకులు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని బొలిశెట్టి ఆరోపించారు.ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, కేశవభట్ల విజయ్,అత్తిలి బాబీ, బయనపాలేపు ముఖేష్, సందక రవణ, మట్ట రామకృష్ణ, గంప లోవరాజు, రౌతు సోమరాజు, కాజులూరు మల్లేష్, కసిరెడ్డి మధులత మరియు బీసీ జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com