Logo
Date of Publish : 31 October 2022, 5:32 pm
Editor : Sake Naresh

బుచ్చియ్యపేట గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

             అనకాపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గం కశింకోట మండలం కొత్తపల్లి బుచ్చియ్యపేట గ్రామంలో  జనసైనికుల ఆత్మీయ సమావేశం కాసిందేవు వెంకట అప్పారావు (అఖిల్ శ్రీను) ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జనసేనాని ఉత్తరాంద్ర పర్యటనలో భాగంగా విశాఖ సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం వేగంగా రాజకీయ సమీకరణాలపై విశ్లేసిస్తూ రానున్న కాలంలో అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా 2024 లో రెపరెపలాడేందుకు జనసైనికులుగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీకి బహుమతిగా ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కోరారు. వచ్చే నెలలో కశింకోట మండలంలో జరిగే జనసేన పార్టీ బహిరంగ సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అనకాపల్లి నియోజకవర్గ నాయకులు మంగా ఈశ్వర్ వివరించారు. ఈ కార్యక్రమంలో కశింకోట మండల నాయకులు గొంతిన ఈశ్వరరావు గారు, కడిమి నాగ చిరంజీవి గారు, గూడెపు మణికంఠ, కలిగెట్ల వీర, కాయల బాబురావు, అనకాపల్లి పట్టణ నాయకులు మద్దాల రాంజీ, వై సాయి ధర్మ, గొన్నా చంటి, పడాల యస్వంత్, మరియు కొత్తపల్లి బుచ్చియ్యపేట గ్రామ జనసైనికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com