
విజయనగరం ( జనస్వరం ) : చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం బొండపల్లి గ్రామంలో రెడ్డి ప్రతాప్’మని, గవిడి కృష్ణ, వెంకటేష్ మరియు గ్రామ జనసైనికులు అద్వర్యంలో బైక్ ర్యాలీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వని, రాజాం నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు, ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ, తుమ్మి అప్పలరాజు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 2024 లో ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగురవేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని జనసైనికులు మరియు నాయకులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.