గూడూరు ( జనస్వరం ) : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా జనసేన పార్టీ శ్రేణులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిత్తలూరు సుందర్ రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మణుక్రాంత్ రెడ్డి సూచనలతో శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ నియోజవర్గ కార్యాలయాన్ని కార్యాలయాన్ని ఆయన సందర్శించిన అనంతరం పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త తీగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని పట్టణ, మండల అధ్యక్షులు, లీగల్ సెల్, ఐటీ విభాగం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనపై ఉన్న నమ్మకంతో తనకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగిందని ఆయన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పార్టీ బలోపేతానికి పాటుపడతానని పేర్కొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని అన్నీ నియోజకవర్గాల్లో పర్యటించడం జరుగుతుందని అందులో భాగంగా మొదటగా గూడూరు పర్యటిస్తున్నట్టు ఆయన తెలిపారు.అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం ఇచ్చే సూచనలతో తీగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మండల, వార్డు, కమిటీలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో సమన్వయం చేసుకొని రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడే విధంగా కృషి చేయాలని కోరారు. అనంతరం జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ పెద్దల సూచనలు సలహాలతో నియోజవర్గ పరిధిలో జనసేన కమిటీ సభ్యులతో సమన్వయ పరచుకుని పార్టీ బలోపేతానికి పని చేస్తామన్నారు. గ్రామీణ మరియు మండల స్థాయిలో జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మెలిసి కేంద్ర కమిటీ ఆదేశించిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ, మండల, కోట, వాకాడు, చిట్టమూరు అధ్యక్షులు పెద్దిశెట్టి ఇంద్రవర్ధన్, పాలిచర్ల భాస్కర్, దామరాపు బాలసుబ్రమణ్య, రౌతు శివ, గుండుబోయిన వాసు, నెల్లూరు రూరల్ నాయకులు కన్నా, మోహన్, చంద్రశేఖర్, గూడూరు నాయకులు రాజశేఖర్, విజయ్, నాగార్జున, అక్బర్, క్రాంతి, వంశీ, కార్తీక్, ఓంకార్, మణి, మస్తాన్, లీగల్ సెల్ సభ్యులు మోహన్, సుమన్, రఘు,ఐటీ వింగ్ స్వరూప్, మహేష్, యస్వంత్ , తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com