యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలోని పెదపాడు గ్రామానికి చెందిన జనసైనికుడు చనిపోయి కూడా నలుగురికి అవయవ దానం చేసిన జనసైనికుడు.. అన్ని దానాల్లో కెల్లా అవయవ దానం గొప్పది.. ఇది మాటలతో సరిపెట్టకుండా చేతల్లో చూపించాడు.. జనసైనికుడు కట్టమూరి వాసు వెళ్లినట్లయితే అచ్యుతాపురం మండలంలో గల పెదపాడు గ్రామానికి చెందిన కట్టమూరి వాసు(21)గత ఐదు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. చికిత్స నిమిత్తం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ కు గురయ్యాడని డాక్టర్లు తెలిపారు. చికిత్స సమయంలో తను తిరిగి మామూలు మనిషి అయ్యే పరిస్థితి లేదని తెలుసుకున్న వాసు.. ఇతరులకు పునర్జన్మ ప్రసాదించాలని నిర్ణయించాడు. తను చనిపోయిన తర్వాత అవయవాలు వేరోకరికి దానం చేయాలని అతని తల్దిదండ్రులకు చెప్పాడు.. ఇంతలో వాసు విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. దీంతో అతని తల్లిదండ్రులు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు.వారి అనుమతితో పోర్టుమార్టం నిర్వహించి శరీరంలోని కీలక అవయవాలను వైద్యులు సేకరించారు. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్, యలమంచిలినియోజకవర్గ ఇంచార్జ్ సుందరపు విజయ్ కుమార్ వారి సూచన మేరకు భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల , సన్యాసి నాయుడు కట్టమూరి వాసు కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పి అంతిమయాత్రలో పాల్గొని, వీరితో పాటు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొని, ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇదిలా ఉండగా వాసు భౌతికంగా తమ మధ్య లేకపోయినా తమ మదిలో శాశ్వతంగా నిలిచిపోయాడని స్నేహితులు వెల్లడించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com