Logo
Date of Publish : 26 November 2022, 4:15 pm
Editor : Sake Naresh

పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సఖి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన సామాజిక కార్యక్రమం

          పిఠాపురం ( జనస్వరం ) : ప్రభుత్వ ఆసుపత్రిలో సఖి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన సామాజిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి గారు పాల్గొన్నారు. లయన్స్ సఖి క్లబ్ సభ్యుల సహాయక దృక్పథాన్ని ఆమె కొనియాడారు. లయన్స్ సఖి క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలో పేషెంట్లకు ఆహారం పంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడాతు ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరం, తను కూడా సఖి క్లబ్ లో భాగస్వామ్యం కావడం నాకు ఆనందదాయకం అన్నారు. పిఠాపురం నియోజవర్గంలో సఖి క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు క్లబ్ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి సమాజానికి సఖి క్లబ్ ద్వారా మహిళలు సేవ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సఖి ప్రెసిడెంట్ అరుణ కుమారి, సభ్యులు నాగలక్ష్మి, అమ్మాజీ, రమణి, జిల్లా జనసేన నాయకులు మొగలి అప్పారావు, చీకట్ల శ్యామ్ కుమార్ , బుర్రా సూర్యప్రకాష్, మేళం రామకృష్ణ, కసిరెడ్డి నాగేశ్వరరావు, కొనమంచిలి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com