Logo
Date of Publish : 03 April 2023, 11:05 am
Editor : Sake Naresh

అనకాపల్లిలో వైసీపీ కి ఎదురుదెబ్బ : జనసేన పార్టీలోకి చేరికలు

       అనకాపల్లి ( జనస్వరం ) : అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి మండలంలో మేజర్ పంచాయతీ అయిన తుమ్మపాలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పల్లెల గణేష్ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి తన 70 మంది అనుచరులతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారి సమక్షంలో జనసేన పార్టీ లోకి చేరారు. తుమ్మపాలలో జరిగిన సభలో భాస్కరరావు గారు వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల్లో మార్పు కేవలం పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం అని అన్నారు. రాష్ట్రంలో తన సొంత డబ్బుతో ప్రజలకు సేవ చేస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే అని పేర్కొన్నారు. పార్టీ మీద నమ్మకంతో పల్లెల గణేష్ గారు లాగా ఇంకా ఎంతో మంది నాయకులు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. జనసైనికుల సమిష్టి కృషితో అనకాపల్లిలో మరియు రాష్ట్రంలో జనసేన జెండా తప్పకుండా ఎగురుతుంది అని తెలిపారు. అనంతరం పల్లెల గణేష్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు తమను ఎంతో ఆకర్షించాయని అన్నారు. అనకాపల్లి లో జనసేన పార్టీ ని గెలిపించి భాస్కరరావు గారిని అసెంబ్లీ కి పంపించేందుకు తాము అందరం కృషి చేస్తాము అని అన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు మంగా ఈశ్వర్, గెంజి సత్యారావు,శ్రీరాందాస్ గోవింద్,మాట్రూ దామోదర్, రాయి జనార్దన్, నగిరెడ్డి పవన్, కోన దుర్గ, నాగేశ్వరావు, బంటు రవి, కొసిరెడ్డి త్రినాధ్, సేనాపతి రవి, పోతిన సాధుబాబు, కోనేటి లోవరాజు, కొమురు ప్రసాద్, కరణం రాము, బొబ్బది రమణ తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com