విశాఖ జిల్లా పశ్చిమ నియజకవర్గ పారిశ్రామిక ప్రాంతం HPCL CDU-3 UNIT లో ఫైర్ బ్లాస్ట్ జరగడం బాధాకరమని జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ యాజమాన్యంతో మాట్లాడి తగు జాగ్రత్తలు పాటించాలని వాళ్లకు సూచిస్తామని చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. కిందటి సంవత్సరం ఇదే నెలలో ఎల్జి పాలిమర్స్, తర్వాత షిప్ యార్డు లొ క్రేన్ యాక్సిడెంట్, ఇపుడు HPCL బ్లాస్ట్ ఇలా అనుకోని ప్రమాదాలు విశాఖలో జరగడం బాధాకరం అన్నారు. గతంలో జనసేన పార్టీ తరుపున అన్నీ పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరిపించాలని కోరామన్నారు. ఇప్పటి వరకూ అలాంటి పనులు ఏవి జరగలేదని అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని సేఫ్టీ ఆడిట్ ప్రతి పరిశ్రమలో జరిపించాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
హిందూపురం నియోజకవర్గం, కొండూరు గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు
అంబులెన్స్ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here