
గజపతినగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారికి బొండపల్లి మండలం గరుడబిల్లి గ్రామంకి వెళ్లి ప్రధాన రోడ్డు మధ్యలో నాలుగు లైన్లు రైల్వే ట్రాక్ ఉండడంవల్ల తరచూ గేటు పడడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లడానికి వీలు లేకుండా,తరచూ ఎంతమంది ప్రాణం కోల్పోవడం జరిగింది,దీనిపై కలెక్టర్ గారికి వినత పత్రం ఇచ్చి వెంటనే బైపాస్ నిర్మించి త్వరగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అద్దడా మోహన్ రావు, డా.రవి కుమార్ మిడతాన,మండలం నాయకులు నాగా రాజు, పైడి రాజు, అప్పలనాయుడు, కామాదాసు, వెంకటేష్ పాల్గొన్నారు.