రాజంపేట ( జనస్వరం ) : పరిధిలోని టి. సుండుపల్లి మండల కేంద్రంలో బస్ షెల్టర్ నందు మరుగుదొడ్లు ఏర్పాటు కొరకు టి.సుండుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ విశ్వనాద్ రెడ్డి గారికి జనసేనపార్టీ తరపున వినతిపత్రాన్ని అందజేసారు. జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ టి. సుండుపల్లి మండల ప్రధాన కేంద్రమైన బస్ షెల్టర్ వద్ద మరుగుదొడ్లు లేక దూరపు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, దూరప్రయాణాలు చేసే వారికి మహిళలు, స్కూల్, కాలేజ్ పిల్లలు, వృద్ధులు పలు రకాల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కావున సదరు విషయమై ఆర్. టి. సి,డి.ఎం గారికి తెలిపి సదరు బస్ షెల్టర్ నందు మరుగుదొడ్లు ఏర్పాటు కోసం కృషి చేయాలని జనసేనపార్టీ మరియు ప్రజలు తరపున కోరుతూ ప్రజా నిత్య అవసరాల కోసం మరుగుదొడ్లకు తగిన నిధులు మంజూరుచేయాలని కోరారు. నిర్మాణ మరమ్మతుల పనులు వెంటనే పరిగణలోకి తీసుకుని తక్షణమే పబ్లిక్ టాయ్లెట్లు పనులు చేపట్టాలని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పియస్ మండల అధ్యక్షుడు మహాదేవ, లోకేష్, శివశంకర్ రాజా, మహేష్, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com