Logo
Date of Publish : 14 November 2023, 9:01 pm
Editor : Sake Naresh

జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా చూడాలని వినతి

     రాజంపేట ( జనస్వరం ) : జనసేనపార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ కడప నుండి రాజంపేట, కోడూరు మీదుగా తిరుపతి వెళ్లే ప్రధాన జాతీయ రహదారిపై రద్దీగా వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో మలుపులు మరియు కొన్ని ప్రమాదకారమైన ప్రదేశాలను ప్రత్యేకంగా గుర్తించి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు రహదారిపై రక్షణగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా వాహనాలు ప్రమాదానికి గురై ప్రాణ నష్టం జరుగుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రావడం లేదు. అందుకే ఇవాళ రాజంపేటలోని ఎజ్గిక్యూటివ్ ఇంజనీర్ కి, అలాగే కడప జాతీయ రహదారి డివిజన్ అధికారికి జాతీయ రహదారి మార్గంలో ప్రమాద మలుపుల్ని గుర్తించి ప్రమాద సూచికలు ఏర్పాటుచేసి ప్రాణాలు కోల్పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరడమైనది. అలాగే రోడ్డు మరమ్మత్తులపైన ద్రుష్టి పెట్టాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామశ్రీనివాస్, వెంకటయ్య, యువ నాయకులు నంద్యాల హరి,మన్నేరు సూరిబాబు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు వాణి శంకర్, టీడీపీ నాయకులు అబుబకర్, కరీమ్, బాలాజీ, మైనార్టీ నాయకులు మహబూబ్ భాష, రామంజులు, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com