
మార్కాపురం ( జనస్వరం ) : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేందుకు మార్కాపురం జిల్లా సాధన వెలుగొండ ప్రాజెక్టు సాధన లక్ష్యంగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గం సమన్వయకర్త ఇమ్మడి కాశీనాథ్ తలపెట్టారు. పాదయాత్ర పొదిలి పట్టణంలోకి అడుగుపెట్టే సందర్భంగా స్థానిక మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద జనసేన పార్టీ నాయకులు హల్చల్ జహీర్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. పొదిలి పట్టణ ప్రధాన రహదారి మీదుగా విశ్వనాథపురం, ఆర్టీసీ డిపో, పోలీసు స్టేషన్, పెద్ద బస్టాండు, చిన్న బస్టాండ్,రథం రోడ్, విశ్వనాథపురం వరకు పాదయాత్ర కొనసాగించారు. స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ సర్కిల్ వద్ద టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త కందుల నారాయణరెడ్డి పాదయాత్రకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు.హల్చల్ జహీర్, నాగార్జున యాదవ్ ,శైలజా, మదర్ వలీ, సూరి, నారాయణ, అసిఫ్, నరహరి, అహ్మద్, నరేంద్ర, మనసూర్ మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.