Logo
Date of Publish : 09 December 2022, 3:30 pm
Editor : Sake Naresh

తుఫాన్ లోనూ ఆగని పవనన్న ప్రజాబాట

         నెల్లూరు సిటీ ( జనస్వరం ) :  నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 207వ రోజున 43వ డివిజన్ పి.ఎన్.ఎం స్కూల్ వద్ద రజాక్ భాయ్ మఖాన్ ప్రాంతంలో మాండూస్ తుఫాన్ లో జోరు వర్షంలోనూ ఆగకుండా జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి ప్రజాసమస్యలను అధ్యయనం చేసి పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ మాండూస్ తుఫాన్ తీవ్రతలో జోరు వర్షంలోనూ ఇంటింటికీ పవనన్న ప్రజాబాట కార్యక్రమం సాగుతోందంటే ప్రజలు తమపై చూపిస్తున్న అపూర్వ ఆదరణ వల్లే సాధ్యమవుతోందని అన్నారు. ఈ ప్రాంతంలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మైనారిటీ సోదరులు ఎక్కువగా నివసిస్తున్నారని, వారు తమపై చూపుతున్న ప్రేమాభిమానాలు మరువలేనివని అన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం షణ్ముఖ వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని, పవనన్న సీఎం కావాలని అల్లాని దువా చేయాల్సిందిగా వారిని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com