ఎచ్ఛర్ల ( జనస్వరం ) : గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో నేడు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎచ్చెర్ల మండలం, తోటపాలేం నుంచి కొత్తపేట వెళ్లి గుంతల రోడ్డు వద్ద నిరసన తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు (సమన్వయకర్త) రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా విష్వక్సేన్ మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వ అవినీతిని, అరాచకాలపై ప్రజలు తరుపున గొంతెత్తున్న ప్రతిపక్ష నాయుకులను అక్రమంగా అరెస్టుల వున్న శ్రద్ద.. ప్రమాదాలకు కారణమవుతున్న అద్వానంతో ఛిద్రమైన రోడ్లునిర్వహణలో చూపే అశ్రద్ధ ఎన్నో కుటుంబాలు బలి అయ్యాయని, రోడ్లు నిర్మించలేని చేతగాని ఈ ప్రభుత్వం త్వరలో ఇంటిదారి పడుతుందన్నారు. అందుకనే జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎచ్చెర్ల టిడిపి యువ నాయకులు, టిడిపి రాష్టకార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, అలాగే జనసేన మండల అధ్యక్షులు, తమ్మినేని శ్రీనివాస్, గోవింద్ రెడ్డి, దుర్గారావు- టీడీపీ మండల అధ్యక్షులు, జనసేన నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, గొర్లె సూర్య, కాకర్ల బాబాజీ , బలరాం , చిరంజీవి, రాజేష్ , నాయుడు జనసైనికులు, వీరమహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com