శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన విజయ యాత్ర పేరుతో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నపుడు పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు జనసేన పార్టీ దృష్టికి తీసుకుని రావడంతో కనీస అవసరాలు అయిన త్రాగు నీరు, స్ట్రీట్ లైట్లు కూడా లేదని ప్రజల ఇబ్బందులు మునిసిపల్ కమీషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లారు. లోబావీ ST కాలనీ , కైలాస గిరి కాలనీలో తాగు నీరు, స్ట్రీట్ లైట్లు లేవని, పట్టణంలో కొండ మిట్ట, తుఫాను సెంటర్, బహదూర్ పేట, శ్రీరామ్ నగర్ కాలనీ, భాస్కర్ పేట, గోపాలవనం, హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వినుత మునిసిపల్ కమీషనర్ కి తెలిపారు. స్ట్రీట్ లైట్లు రానున్న 10 రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. లోబావి ST కాలనీ, కైలాసగిరి కాలనీలో నీటి సమస్య కూడా పరిశీలించి తక్షణమే పరిష్కరిస్తామని కమీషనర్ గారు హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ప్రధాన కార్యదర్శులు రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, చంద్ర శేఖర్, నాయకులు శ్రీ రామ్, బత్తెమ్మ, శారద , తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com