- రాష్ట్ర చీఫ్ సమాచార కమిషనర్‌కు ముడమాల రమేష్ రెడ్డి విజ్ఞప్తి
నెల్లూరు, జూలై 23 (జనస్వరం): ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయం ఆర్టీఐ సెల్ కన్వీనర్ ముడమాల రమేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సమాచార కమిషనర్ వర్ర శ్రీనివాస్ రావును మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ముడమాల రమేష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో దాఖలు చేసే ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీళ్లకు వ్యక్తిగత ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం ప్రజలు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ తదితర ఆఫ్‌లైన్ విధానాల ద్వారా ఆర్టీఐ దరఖాస్తులను పంపించిన తర్వాత అవి సంబంధిత కార్యాలయానికి చేరాయా లేదా అనే సమాచారం మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు. అయితే, ఆ దరఖాస్తును ఏ అధికారి స్వీకరించారు, సంబంధిత ప్రజా సమాచార అధికారి (PIO)కి పంపించారా, దాని ప్రస్తుత స్థితి ఏమిటి, ఎప్పుడు సమాధానం ఇవ్వబడుతుంది వంటి కీలక సమాచారాన్ని తెలుసుకునే అవకాశం లేకుండా పోతోందని అన్నారు. అదేవిధంగా, మొదటి అప్పీళ్ల అధికారి (First Appellate Authority - FAA) వివరాలు, అప్పీల్ దాఖలు చేయడానికి ఉన్న గడువు, అప్పీల్ స్థితి వంటి వివరాలను కూడా ప్రజలు సులభంగా తెలుసుకోలేకపోతున్నారని తెలిపారు. జిల్లా, మండల, శాఖల స్థాయిలో ఆర్టీఐ దరఖాస్తుల పర్యవేక్షణకు ఎటువంటి సమగ్ర వ్యవస్థ లేకపోవడం వల్ల పారదర్శకత, జవాబుదారీతనం దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సమాచార కమిషనర్ క్రింది అంశాలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు:
ఈ విధమైన వ్యక్తిగత ఆర్టీఐ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయడం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతో పాటు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని ముడమాల రమేష్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను రాష్ట్ర సమాచార కమిషన్ సానుకూలంగా పరిశీలించి తగిన విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.