Logo
Date of Publish : 24 July 2026, 1:30 am
Editor : Sake Naresh

ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీళ్లకు వ్యక్తిగత ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి

- రాష్ట్ర చీఫ్ సమాచార కమిషనర్‌కు ముడమాల రమేష్ రెడ్డి విజ్ఞప్తి

నెల్లూరు, జూలై 23 (జనస్వరం): ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయం ఆర్టీఐ సెల్ కన్వీనర్ ముడమాల రమేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సమాచార కమిషనర్ వర్ర శ్రీనివాస్ రావును మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ముడమాల రమేష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో దాఖలు చేసే ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీళ్లకు వ్యక్తిగత ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం ప్రజలు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ తదితర ఆఫ్‌లైన్ విధానాల ద్వారా ఆర్టీఐ దరఖాస్తులను పంపించిన తర్వాత అవి సంబంధిత కార్యాలయానికి చేరాయా లేదా అనే సమాచారం మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు. అయితే, ఆ దరఖాస్తును ఏ అధికారి స్వీకరించారు, సంబంధిత ప్రజా సమాచార అధికారి (PIO)కి పంపించారా, దాని ప్రస్తుత స్థితి ఏమిటి, ఎప్పుడు సమాధానం ఇవ్వబడుతుంది వంటి కీలక సమాచారాన్ని తెలుసుకునే అవకాశం లేకుండా పోతోందని అన్నారు. అదేవిధంగా, మొదటి అప్పీళ్ల అధికారి (First Appellate Authority - FAA) వివరాలు, అప్పీల్ దాఖలు చేయడానికి ఉన్న గడువు, అప్పీల్ స్థితి వంటి వివరాలను కూడా ప్రజలు సులభంగా తెలుసుకోలేకపోతున్నారని తెలిపారు. జిల్లా, మండల, శాఖల స్థాయిలో ఆర్టీఐ దరఖాస్తుల పర్యవేక్షణకు ఎటువంటి సమగ్ర వ్యవస్థ లేకపోవడం వల్ల పారదర్శకత, జవాబుదారీతనం దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సమాచార కమిషనర్ క్రింది అంశాలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు:

  1. ప్రతి ఆర్టీఐ దరఖాస్తుకు (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) ప్రత్యేక ట్రాకింగ్ నంబర్‌ను కేటాయించాలి.
  2. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే విధమైన కేంద్రీకృత ఆర్టీఐ ట్రాకింగ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలి.
  3. ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీళ్లను రియల్‌టైమ్‌లో ట్రాక్ చేసే సౌకర్యాన్ని కల్పించాలి.
  4. ప్రతి దశలో ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తుదారులకు సమాచారం అందించాలి.
  5. సంబంధిత ప్రజా సమాచార అధికారి (PIO) పేరు, హోదా, కార్యాలయ చిరునామా, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను అందుబాటులో ఉంచాలి.
  6. సంబంధిత మొదటి అప్పీళ్ల అధికారి (FAA) పూర్తి వివరాలను కూడా ప్రదర్శించాలి.
  7. ఆర్టీఐ చట్టం–2005లోని సెక్షన్ 6(3) ప్రకారం ఇతర శాఖలకు బదిలీ చేసిన దరఖాస్తులను కూడా అదే ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ట్రాక్ చేసే అవకాశం కల్పించాలి.
  8. మొదటి అప్పీల్ దాఖలు చేయడానికి ఉన్న చివరి తేదీని ఆటోమేటిక్‌గా ప్రదర్శించడంతో పాటు, అప్పీల్ స్థితిని కూడా తెలుసుకునే అవకాశం కల్పించాలి.
  9. జిల్లా, మండల స్థాయిలో ఆర్టీఐ మానిటరింగ్ డ్యాష్‌బోర్డులను ఏర్పాటు చేసి, దరఖాస్తుల సకాలంలో పరిష్కారాన్ని పర్యవేక్షించాలి.
  10. దరఖాస్తు పెండింగ్‌లో ఉందా, సమాధానం ఇచ్చారా, తిరస్కరించారా లేదా ఇతర శాఖకు బదిలీ చేశారా అనే సమాచారాన్ని స్పష్టంగా చూపించాలి.

ఈ విధమైన వ్యక్తిగత ఆర్టీఐ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయడం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతో పాటు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని ముడమాల రమేష్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను రాష్ట్ర సమాచార కమిషన్ సానుకూలంగా పరిశీలించి తగిన విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com