గుంతకల్లు, (జనస్వరం) : గుంతకల్ పట్టణం, సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఏర్పాటుచేసిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించిన వాసగిరి మణికంఠ మాట్లాడుతూ పర్యావరణహితాన్ని కోరుతూ ప్రదర్శించిన బాల సైంటిస్టుల ప్రాజెక్టులు ఆలోచింపజేశాయని ముఖ్యంగా చిన్నారులు చేసిన రకరకాల ప్రాజెక్టులు వారి ప్రతిభకు దర్పణం పట్టిందని. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు వేదికగా నిలుస్తాయని, విద్యార్థులు నిత్యం బంగారు కలలు కనలని, వాటిని సహకారం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించి చిన్నారులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్ సీనియర్ నాయకులు కసాపురం నందా, కత్తుల వీధి అంజి, ఆటో రామకృష్ణ, అనిల్ కుమార్, అమర్, లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com