
విజయనగరం, (జనస్వరం) : విజయనగరం నియోజకవర్గం స్థానిక గుంకలాం గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ముఖ్య అతిధిగా విచ్చేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేనపార్టీ విజయనగరం నియోజకవర్గంలో స్థానికంగా ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా మా జనసైనికులు అందుబాటులో ఉంటారని, అలాగే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజాసమస్యలుపై పోరాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ప్రజాసేవలో మమేకమై అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ఇదే విధంగా విజయనగరం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన జనసేన పార్టీ కార్యాలయాలు త్వరలో ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ఈరోజు మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన గుంకలాం గ్రామ జన సైనికులకు మరియు విజన్ హెల్త్ ఆర్గనైజేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయం హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండర్ రామకృష్ణ, జనసేన పార్టీ జిల్లా నాయకులు లాలిశెట్టి రవితేజ, యువజన నాయకులు లోకల్ బాయ్ ప్రసాద్, మండల కో-ఆర్డినేటర్ చంద్ర నాయుడు, నియోజకవర్గ నాయకులు పతివాడ చంద్రశేఖర్, కునుకు రమణ, లెంక రమణ, సిడగాం నారాన్నాయుడు, లెంక సత్తిబాబు, కెల్ల అప్పలనాయుడు, పైలా రాంబాబు, బొద్దుల సన్యాసి రావు, కునుకు రాంబాబు, కునుకు మణి మరియు గుంకలాం గ్రామ జనసైనికులు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని మెడికల్ క్యాంపు విజయవంతం చేయడం జరిగింది.