
ఆమదాలవలస, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, ఏర్పాటు చేసినటువంటి మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసి, 92 మంది రక్తం దానం చేసినటువంటి రక్తదాతలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గము జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(MPTC), జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో కొల్లివలస సెంటర్లో, సెప్టెంబర్ 2వ తేదీన న్యూ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో మెగా రక్తదానం శిబిరం బూర్జ మండలం SI చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. బూర్జ మండలం ఎస్సై, మా ఆహ్వానాన్ని మన్నించి, విచ్చేసినటువంటి ఎస్ఐ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరంలో 92 మంది దాతలు, రక్తం దానం చేయడం జరిగింది. రక్తం దానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసి, విజయవంతం చేసిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామని తెలిపారు.