ఎచ్చర్ల నియోజకవర్గంలో క్రాంతిశ్రీ గారి సమక్షంలో 4 మండలాల జనసైనికుల, వీరమహిళలతో సమావేశం ఏర్పాటు
ఎచ్చర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి క్రాంతిశ్రీ గారి సమక్షంలో సామాజిక దూరం పాటిస్తూ, కరోనా నిబంధనల్ని పాటిస్తూ 4 మండలాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టెంబర్2 వ తేదీన జనసేనాని జన్మదిన సందర్భంగా వారం రోజుల పాటు వేడుకలగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ తమ సూచనలు, సలహాలు, సమస్యలు తెలియజేసారు. పార్టీ పెద్దలు సూచన మేరకు మొదటి రోజు ప్రధానంగా కరోనా బాధితులకు వెంటిలేటర్స్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా చిరంజీవి యువతి అధ్యక్షులు Dr విశ్వక్ గారు తెలియజేసారు. 2 వరోజు పోలీసు, సచివాలయం, మండల, నియోజకవర్గం హాస్పిటల్స్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేయడం, 3వ రోజు బీద ప్రజలు భోజన ఏర్పాట్లు, 4 వరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని, 5వరోజు రక్తదాన శిబిరం, 6వరోజు హోమియో జనరిక్ పంపిణీ, 7వ రోజు కరోనా వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో లావేరు, ఎచ్చర్ల, రణస్థలం, జి.సిగడం మండలం జనసైనికులు, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com