Logo
Date of Publish : 19 October 2023, 8:45 pm
Editor : Sake Naresh

టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో చేరికలు

       అనంతపురం ( జనస్వరం ) : చిత్తశుద్ధి నిబద్ధత కలిగిన  పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్, రాయలసీమ ప్రాంతీయ మహిళా కమిటీ సభ్యులు పెండ్యాల శ్రీలత అన్నారు. గురువారము నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రముఖ వ్యాపారవేత్త డాలర్ మధు ఆధ్వర్యంలో 50 మంది యువకులు టి.సి.వరుణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. వారికి వరుణ్ పార్టీ కండువా వేసి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ... అధికార వైసిపి నాలుగేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అనంత నగరంలో అభివృద్ధి ఏమాత్రం కానరావడం లేదని.. కేంద్రం నిధులతో జరిగిన పనులను వైసిపి తమ గొప్పలుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. అనంత నగర అభివృద్ధి పట్ల జనసేనకు ప్రత్యేక కార్యాచరణ ఉందని.. అందులో భాగంగా నగర ప్రజల అభిష్టాన్ని ప్రతిబింబించేలా మేనిఫెస్టో రూపొందించామన్నారు. పార్టీలోకి చేరిన పెద్దలకు, యువతకు సముచిత స్థానం ఉంటుందని.. మీకు ఏ సమస్య వచ్చినా తాను ముందు ఉంటానని... ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని వరుణ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కుమ్మర నాగేంద్ర, కార్యదర్శులు కిరణ్ కుమార్, సిద్దు, జయమ్మ, అవుకు విజయకుమార్, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, చక్రపాణి, కార్యదర్శిలు కుమ్మర మురళి, వడ్డే వెంకటేష్, వెంకటరమణ, ఆకుల అశోక్, బెల్గుబ్బ మండల అధ్యక్షులు  సుధీర్, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్, వీరమహిళలు అనసూయ, దాసరి సరిత, మంజుల మరియు నాయకులు శీను, నౌషాద్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com