Logo
Date of Publish : 11 February 2024, 10:17 pm
Editor : Sake Naresh

ఏలూరులో ఘనంగా జనసైనికుల ఆత్మీయ సమావేశం

   ఏలూరు ( జనస్వరం ) : ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనశ్రేణులతో నగిరెడ్డి కాశీనరేష్ అధ్యక్షతన రెడ్డి అప్పల నాయుడు గారి సమక్షంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా ఎన్నికల నిర్వహణ కన్వీనర్ రాఘవయ్య చౌదరి, జనసేన నాయకులు నారా శేషు వివిధ సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏలూరులో రెడ్డి అప్పల నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి వివిధ పార్టీల నుండి సుమారు 500 మంది నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వీరికి రెడ్డి అప్పల నాయుడు, ఘంటసాల వెంకటలక్ష్మీ, నారా శేషు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. వీరికి రానున్న 2024 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అని దశ నిర్దేశం చేశారు.. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించాలని రానున్న రోజుల్లో ఏలూరు నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రెడ్డి అప్పల నాయుడు సూచించారు.. రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగురవేయడం కోసం కావలసిన ప్రణాలికను రచించడం కోసం వ్యూహాత్మకంగా ఉన్న అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దిశగా మనమందరం కృషి చేయాలని కోరారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు ఆళ్ళనాని ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు..ఆయన మాట్లాడుతూ ప్రజలను మరోసారి మాయమాటలతో మోసం చేయడానికి జగన్ రెడ్డి ఆళ్ళనాని కుట్రలు పన్నుతున్నారు.. ఐతే ఈసారి మోసపోవడానికి ఏలూరు జనం సిధ్ధంగా లేరనే విషయాన్ని గుర్తించాలని రెడ్డి అప్పల నాయుడు స్పష్టంగా తెలియజేశారు.. నా ఎదుగుదల చూసి ఓర్వలేక నాపై నిరాధారమైన ఆరోపణలు చేయిస్తున్నాడు ఈ ఆళ్ళనాని.. ఏలూరులో ఆళ్ళనాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేయని స్కాం ఏదైనా ఉందా అని తిరిగి ప్రశ్నించారు.. ఏలూరుకు మీరు చేసిన అభివృద్ధి ఏమిటి అని ప్రశ్నించారు.. ఏలూరుకు లో వచ్చిన ఆదాయాన్ని ఏ రూపంలో ఖర్చు చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.. ఏలూరులో మీది 30 సంవత్సరాల ప్రస్థానం.. కానీ మీరు ఏలూరుకు చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం.. ఇప్పటికీ ఏలూరు ప్రజలు మిమ్మల్ని ఇంటికి సాగనంపడానికి సిధ్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు, వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com