Logo
Date of Publish : 15 February 2026, 7:45 pm
Editor : Sake Naresh

మహాశివరాత్రి సందర్భంగా వైభవంగా శ్రీ పొలతల అక్క మహాదేవతల మహోత్సవం

* 14 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సంప్రదాయం

* మహానీటి కోనలో ఏడు అక్కచెల్లెమ్మలకు ప్రత్యేక అభిషేకాలు

* ఉరుములు, భాజాబంధురులతో ఘన శోభాయాత్ర

అనంతపురం ఫిబ్రవరి 15 :- మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ అక్క మహాదేవతల వార్షిక ఉత్సవాలు ఈ సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించబడ్డాయి. 14వ వార్షికోత్సవాన్ని సందర్భంగా ఆలయ ప్రాంగణం పుష్పాలంకరణలతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా మారింది. పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్ల దర్శనం పొందారు.ఉదయం నుంచే వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అక్కదేవతలకు మహా మంగళహారతులు సమర్పించగా, మహానీటి కోన వద్ద ఏడు మంది అక్క చెల్లెమ్మలకు పాలు, పెరుగు, తేనె, చందనం, కుంకుమ వంటి పవిత్ర ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లను వెండి ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ సేవకులు ఆధ్వర్యంలో అన్న ప్రసాదాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వెయ్యి మందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవార్ల ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామ పెద్దలు, దాతలు మరియు యువకుల సహకారంతో కార్యక్రమం విజయవంతమైంది. భక్తులు ఈ సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు. సాయంత్రం వేళ ఉరుములు, భాజాబంధురుల నాదాల మధ్య అమ్మవార్ల శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. మేరవన గుడి నుండి ఆర్మూర్ రోడ్డు కొడలి,వైపు సాగిన ఈ ఊరేగింపు చంద్రబాబు నాయుడు కొట్టాలా, రుద్రంపేట, తదితర ప్రాంతాల గుండా కొనసాగింది. మార్గమధ్యంలో భక్తులు దీపారాధనలు చేసి, కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ భక్తి పరవశంతో అమ్మవార్ల దర్శనం పొందారు. గత 14 సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతుండటం విశేషం. శ్రీ పొలతల అక్క మహాదేవతల ఆశీర్వాదం కోసం భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఈ ఉత్సవాలు ప్రాంతీయ ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com