మదనపల్లి ( జనస్వరం ) : రాజా నగర్ మొదటి గ్రాస్ లో జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన టిడిపి ఉమ్మడి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గౌతమి స్కూల్ ఒకటవ తరగతి నుండి 10 వరకు ఉన్నారు. ఈ స్కూల్ కి అనుకొనే పెద్ద డంపింగ్ యార్డ్ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. చెత్త పన్ను వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వం బడి పక్కనే చెత్త వేయడం అనేది ఎంతవరకు సమంజసం. కేవలం బడి పిల్లలకు కాకుండా చుట్టుపక్కల వీధులకు కూడా భయంకరమైన కి కుళ్లిపోయిన చెత్తతో దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వము ఇదేనా విద్యార్థుల ఆరోగ్యము ఇదేనా ప్రజల ఆరోగ్యముపై దృష్టి చూపడం అని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సుకన్య, కవిత ప్రసన్న, మాధవి లత, మమత, జనసైనికులు ధరణి శివ, బహదూర్ శంకర, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com