రాజోలు ( జనస్వరం ) : మలికిపురం మండలం లక్కవరం M. G గార్డెన్స్ లో జిఎస్ఎల్ రాజానగరం వారి సౌజన్యంతో మంగెన వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 18 విభాగాల డాక్టర్లతో శ్రీ మంగెనా గంగయ్య స్మారక ఉచిత మెగా వైద్య శిబిరంలో జీఎస్ఎల్ వైద్య బృందం రెండు రోజులపాటు సుమారు 1200 మందికి వైద్య సేవలు అందించారు. ఈ మెగా వైద్య శిబిరంలో వైద్య సహకారాలు అందించిన GSL డాక్టర్లు, మిత్ర బృందాలు, ఉచిత మెడిసిన్ NTR ట్రస్ట్ వారు అందించారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు, టీడీపీ పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, వాలంటీర్లుగా సేవలు అందించిన వీర మహిళలు, విద్యార్థినులు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com