Search
Close this search box.
Search
Close this search box.

అన్నం పెట్టే రైతన్నే రాజు కావాలి : రాజాం జనసేన నాయకులు

రాజాం

      రాజాం ( జనస్వరం ) : టీమ్ పిడికిలి సహకారంతో రాజాం నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు నాయకత్వంలో శ్యాం పురం గ్రామంలో జనసేన రైతు భరోసా యాత్ర వాల్ పోస్టర్స్ ని రాజాం మండల నాయకుడు నమ్మి దుర్గారావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సేవాదృక్పధంతో రాష్ట్రవ్యాప్తంగా 3వేల మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 30కోట్లు ఆర్థిక సహాయం అందిస్తూ ఆ బాధిత కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నారన్నారు. అన్నం పెట్టే రైతన్నే రాజు కావాలనదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎకల రాము, డోప్ప రాంబాబు, డోప్ప మహేష్, శ్రీను, ఆది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way